Home  »  Featured Articles  »  Arjun: అర్జున్ రికార్డుని ఇక ఏ తెలుగు హీరో కూడా అందుకోలేడు.. ఇది ఒక చరిత్ర 

Updated : Jun 29, 2026

 

యాక్షన్ కింగ్ అర్జున్(Arjun).. ఈ పేరుకి ఉన్న చరిష్మా, సృష్టించిన రికార్డులు బహుశా ఇక తెలుగు సినిమా చరిత్రలో ఏ హీరో సృష్టించడేమో. తెలుగు ఫీల్డ్ అనే  కాదు ఎనీ లాంగ్వేజ్ తీసుకున్నా ఏ హీరో కూడా అర్జున్ రికార్డుని సృష్టించలేడు. అసలు దరి దాపుల్లోకి కూడా రారు. మరి ఆ రికార్డు ఏంటో చూద్దాం.

మా పల్లెలో గోపాలుడు.. అర్జున్ తొలిసారి తెలుగు తెరపై మెరిసిన మూవీ. ఈ మూవీకి ముందు తన సొంత లాంగ్వేజ్ కన్నడలో పలు చిత్రాలు చేసినప్పటికీ మా పల్లెలో గోపాలుడు ద్వారానే తెలుగునాట అడుగుపెట్టాడు. ఈ సినిమా సాధించిన వసూళ్లు మరియు రికార్డులు అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాయి. విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో ఏకంగా 21 కేంద్రాలలో విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఇది ఆ కాలంలో ఒక కొత్త హీరో సాధించలేని అరుదైన రికార్డు. అంతటితో ఆగకుండా, ప్రేక్షకుల నీరాజనాలతో ఏకంగా 367 రోజులు అంటే ఒక సంవత్సరం పైగా ప్రదర్శితమై సరికొత్త చరిత్ర సృష్టించింది.  367 రోజులు ఆడిన కేంద్రాలు హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ. దీంతో అర్జున్ ని ఓవర్ నైట్  తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్టార్‌గా నిలబెట్టింది.

 1985 ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీలోని గ్రామీణ నేపథ్యంలో సాగే అమాయకపు ప్రేమ, సెంటిమెంట్, ఆకట్టుకునే ఫ్యామిలీ ఎమోషన్స్ థియేటర్లకి  కుటుంబాలు, కుటుంబాలు  వలస కట్టేలా చేశాయి. అగ్ర దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ మూవీని .భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్. గోపాల్ రెడ్డి నిర్మించాడు. 

అర్జున్ సరసన పూర్ణిమ కథానాయికగా నటించగా, గొల్లపూడి మారుతీరావు, రాజా, వై. విజయ ముఖ్యమైన క్యారెక్టర్స్ లో  మెప్పించారు. ముఖ్యంగా వై. విజయ పోషించిన పాత్ర మూవీకి పెద్ద అసెట్ గా నిలిచింది.స్వరబ్రహ్మ కె.వి. మహదేవన్ అందించిన సంగీతం అత్యంత ప్రాచుర్యం పొందింది. నేను ఈల వేస్తే గోలకొండ అదిరిపడతది", "రాణీ రాణమ్మా", "ఘుం ఘుం ఘుం ఘుం గుమ్మెత్తింది గోదారిసీమ" తో పాటు మొత్తం  5 అద్భుతమైన పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల గాత్రం పాటలకి  ప్రాణం పోశాయి. గణేష్ పాత్రో రాసిన పదునైన డైలాగ్స్ కూడా సినిమా విజయానికి ముఖ్య కారణం. ఈ ఘన విజయంతో దర్శకుడు కోడి రామకృష్ణ, హీరో అర్జున్ కాంబినేషన్ ఎంత హిట్ అయిందంటే, ఆ తర్వాత వీరిద్దరి కలయికలో మరో 4 సూపర్ హిట్ చిత్రాలు రూపొందాయి. టాలీవుడ్ చరిత్రలో 367 రోజుల లాంగ్ రన్ రికార్డుతో నిలిచిన "మా పల్లెలో గోపాలుడు" ఎప్పటికీ ఒక అపురూప క్లాసిక్ సినిమా.  తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎందరో హీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి, ఏకంగా ఒక సంవత్సరం పైగా థియేటర్లలో ఆడిన ఘనత మాత్రం అర్జున్ కె దక్కుతుంది. 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.